- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆసియా కప్ గెలిచిన టీమిండియా.. ఆ ప్లేయర్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హైదరబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా సిరాజ్‌పై దిగ్గజ సినీ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టోలిచౌకి కుర్రాడు 6 వికెట్లను పడగొట్టి అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ కేవలం 21 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లను పడగొట్టాడు.
50 పరుగులకు కట్టడి చేయడంలో బౌలర్ సిరాజ్ ముఖ్య పాత్ర పోషించాడు. అంతే కాదు తన బౌలింగ్లో బౌండరీని ఆపడానికి లాంగ్ ఆన్‌కు పరిగెత్తి అందరి హృదయాలను గెలిచాడు అంటూ పోస్ట్ చేశారు. శ్రీలంక లాంటి జట్టును కేవలం 50 పరుగులకు కట్టడి చేయడం అంత మామూలు విషయం కాదు.’’ అంటూ జక్కన్న సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.