Powerstar: పవర్‌స్టార్ కోసం రంగంలోకి దిగిన తమిళ్ స్టార్.. !!

by Anjali |   ( Updated:2024-09-03 14:55:17.0  )
Powerstar: పవర్‌స్టార్ కోసం రంగంలోకి దిగిన తమిళ్ స్టార్.. !!
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్న పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫ్యాన్స్ నెట్టింట తెగ హంగామా చేశారు. అభిమానులు, సినీ సెలబ్రిటీలతో పాటు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగా కుటుంబం (మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్ కొణిదెల, నిహారిక, మెగా కోడలు లావణ్య, ఉపాసన) స్పెషల్ గా విష్ చేస్తూ.. ఏపీ ఉపముఖ్యమంత్రి అయ్యాక మొదటి బర్త్ డే కాబట్టి.. మరింత ప్రత్యేకం అంటూ పవన్ గొప్పతనాన్ని వర్ణిస్తూ అద్భుతంగా విష్ చేశారు. దీంతో డీవీవీ మూవీస్‌కు, హీరో అడివి శేష్, నిఖిల్ సిద్ధార్థ, యాంకర్ సుధీర్, విజయశాంతి ఫిల్మ్, గీతా ఆర్ట్స్.. వీరితో పాటుగా మెగా కోడలు లావణ్య త్రిపాఠికి జనసేన ధన్యవాదాలు తెలిపింది.

ఇకపోతే పవర్ స్టార్ గురించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్నోన్న ‘ఓజీ’ చిత్రంలో తమిళ్ స్టార్ శింబు ఓ అద్భుతమైన పాట పాడబోతున్నారట. ఈయన హీరోనే కాకుండా.. మంచి సింగర్ అన్న విషయం తెలిసిందే. తారక్, నిఖిల్, మనోజ్ వంటి హీరోల సినిమాల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే సాంగ్స్ పాడారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కోసం రంగంలోకి దిగననున్నారట. దీనిపై త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారట. ఈ వార్త విన్నడిప్యూటీ సీఎం అభిమానులు గూస్‌బంప్స్ పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed