Surya: బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ‘సూర్య’.. పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!

by Hamsa |
Surya: బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ‘సూర్య’.. పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విభిన్న కథలతో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. తనదైన యాక్టింగ్‌తో సూర్య దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రజెంట్ ‘కంగువా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 8 భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో నవంబర్ 14న విడుదల కానుంది. అలాగే సూర్య మరో చిత్రాన్ని కూడా లైన్ పెట్టారు.

ఇదిలా ఉంటే.. సూర్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తుఫాన్ మూవీతో డిజాస్టర్ అందుకున్న సీనియర్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మెహ్రాతో సూర్య వర్క్ చేయనున్నట్లు టాక్. అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ‘కర్ణ’ అనే పవర్ ఫుల్ టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇందులో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది.

దీనిపై ఓం ప్రకాష్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఐఫా వేదికగా మాట్లాడుతూ.. సూర్యతో ఓ సినిమా చేస్తున్నానంటూ వస్తున్న వార్తలు నిజమే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఇప్పుడే అన్ని విషయాలు రివీల్ చేయాలనుకోవడం లేదు. కాబట్టి సమయం వచ్చినప్పుడు అధికారికంగా తెలియజేస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed