- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏకంగా స్టార్ హీరోకే గాలం వేసిన శ్రీముఖి.. పెళ్లి కూడా ఫిక్స్..?
దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె ఓ వైపు యాంకరింగ్ అదరగొడుతూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా వరుస పెట్టి యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతుంది. టైమింగ్ పంచులు, కామెడీతో ప్రతి ఒక్కరినీ తన మాటలతో ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో శ్రీముఖికి పెద్దగా అవకాశాలు రాకపోయేది.
కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్ కు వెళ్లిందో.. ఇక అప్పటి నుంచి ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో రొమాంటిక్ గా నటించి మెగా ఫ్యాన్స్ వద్ద మార్కులు కొట్టేసింది. ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంటూ.. శ్రీముఖి తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు స్టార్ మా లో సూపర్ సింగర్ అనే రియాలిటీ షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. ఇకపోతే కొద్ది రోజుల నుంచి శ్రీముఖి పెళ్లి పై అనేక రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.
సీరియల్ నటుడితో ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతుందని నెట్టింట జోరుగా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ బ్యూటీ వివాహం పై మరో వార్త హల్ చల్ చేస్తోంది. సైలెంట్ గా ఉంటూనే శ్రీముఖి ఓ స్టార్ హీరోకు గాలం వేసిందట. వీరిద్దరు లవ్ లో ఉండి కూడా నాలుగైదేళ్లు అవుతుందని టాక్. ఇక ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లో వీరి మ్యారేజ్ జరగనుందని సమాచారం. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.