Pawan Kalyan: పవర్ స్టార్‌పై సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

by Anjali |   ( Updated:2024-09-03 14:53:23.0  )
Pawan Kalyan: పవర్ స్టార్‌పై సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే ను నిన్న ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సందడి చూడాలి.. హైదరాబాదులోని పలు థియేటర్ల వద్ద తెగ హంగామా చేశారు. ఇకపోతే సెప్టెంబరు 5 వ తేదీన విడుదలయ్యే గోట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ మొత్తం హాజరయ్యారు. ఇందులో భాగంగానే సీనియర్హీ స్టార్ రోయిన్ స్నేహా పవర్ స్టార్ పై పొగడ్తల వర్షం కురిపించింది.

‘మీరు ఎన్నో సినిమాల్లో నటించారు కదా? వాళ్లలో ఎవరు మీకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అని యాంకర్ ప్రశ్నిస్తుంది. దీనిపై స్నేహా స్పందించి.. ‘నేను టాలీవుడ్‌లో దాదాపు అందరి హీరోలతో నటించాను. కానీ మెగాస్టార్ చిరంజీవి అండ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి నటించలేకపోయారు. ఈ బాధ నాకు ఎప్పటికీ ఉంటుంది. ముందుగా పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నాకు ఆల్ టైం గ్రేటెస్ట్ పవర్ స్టారే. ఆయన రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా పవర్ స్టారే’ అని స్నేహా ఏపీ డిప్యూటీ సీఎం పై పొగడ్తల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed