ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ‘సింగం అగైన్’ ట్రైలర్.. మూవీ థియేటర్స్‌లో విడుదలయ్యేది ఎప్పుడంటే?

by Hamsa |
ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ‘సింగం అగైన్’ ట్రైలర్.. మూవీ థియేటర్స్‌లో విడుదలయ్యేది ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్, రోహిత్ శెట్టి కాంబోలో వచ్చిన ‘సింగం’ మూవీ ఇప్పటికే రెండు పార్టులు విడుదలై భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు సింగం సినిమాకు ‘సింగం అగైన్’ పేరుతో సీక్వెల్ రాబోతుంది. అయితే ఇందులో అజయ్ దేవ్‌గణ్, కరీనా కపూర్ జంటగా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ జాకీ ష్రాఫ్, రణ్‌వీర్ సింగ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 1న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా మేకర్స్ ‘సింగం అగైన్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే రామాయణం కథ బేస్‌డ్ చేసుకుని తెరకెక్కిన ఈ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.



Advertisement

Next Story

Most Viewed