- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రితేష్ బ్రేకప్ చెప్పడంతో షాక్ అయ్యా.. జెనీలియా కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ జెనీలియా బాయ్స్, బొమ్మరిల్లు వంటి సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కానీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో కొద్ది కాలం డేటింగ్ చేసింది. అది కాస్త ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి మరీ 2012లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి 2022లో ‘వేద్’ అనే మూవీ చేశారు. ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి జెనీలియా పూర్తిగా సినిమాలకు దూరం అయింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా తాను డేటింగ్‌లో ఉన్న సమయంలో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. ‘‘మేము డేటింగ్‌లో ఉన్న సమయంలో జరిగిన సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను.
నేను చాలా త్వరగా నిద్రపోయేదాన్ని. కానీ రితేష్‌కు మాత్రం ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉండేది. అయితే ఒకరోజు అర్ధరాత్రి 1 గంటకు రితేష్ నాకు ఓ మెసేజ్ పెట్టారు. అందులో ఏముందంటే.. ఇక అంతా అయిపోయింది. బ్రేకప్’ అని అన్నారు. నేను తెల్లవారుజామున అది చూసి షాకయ్యా. చాలా బాధపడ్డాను. తర్వాత అసలు ఎందుకలా అన్నారో? ఏం జరిగిందో తెలియక సతమతమయ్యా.
ఆ సమయంలోనే అతను ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడిగారు. రాత్రి పెట్టిన మెసేజ్ పూర్తిగా మర్చిపోయారు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. ఇకపై మనం మాట్లాడుకోకపోవడం బెటర్ ఏం జరగలేదన్నట్లు అలా ఎలా మాట్లాడుతున్నావ్ అని అరిచాను. దీంతో రితేష్ కాసేపు ఆలోచించి రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ మెసేజ్ జోక్‌గా చేశానని చెప్పడంతో అప్పుడు హమ్మయ్య అనుకున్నా’’ అని చెప్పుకొచ్చింది.