శివాజీకి నిజంగానే రెండో పెళ్లాం, కూతురు ఉన్నారా.. క్లారిటీ ఇచ్చిన హీరో!

by Hamsa |   ( Updated:2024-01-18 04:58:22.0  )
శివాజీకి  నిజంగానే  రెండో పెళ్లాం, కూతురు ఉన్నారా.. క్లారిటీ ఇచ్చిన హీరో!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో శివాజీ ఇటీవల బిగ్‌బాస్ సీజన్-7లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాకే కనుక ఇలాంటి కూతురు ఉంటే.. పీక మీద కాలేసి తొక్కిపారేసేవాడి నంటూ శోభాశెట్టిపై ఫైర్ అయ్యాడు. అది చూసిన ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సమీర్, శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు కూడా ఉందనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా సమీర్ కామెంట్స్‌పై శివాజీ స్పందించారు. ‘‘ఏమో సమీర్ నాకు దత్తత ఇచ్చాడేమో ఎవర్నైనా? సమీర్ నాకు మొదటి నుంచి తెలిసిన వ్యక్తి కాదు. నాకంత క్లోజ్ కూడా కాదు. మా ఇద్దరి మధ్య హాయ్.. బై.. అనుబంధం తప్పితే.. మా కుటుంబం గురించి.. నా పర్సనల్ విషయాలు తెలిసేటంత క్లోజ్‌నెస్ లేదు. నాకు బాగా సపోర్ట్ చేశారు.. నా గురించి చాలా బాగా మాట్లాడారు.

నా కుటుంబం గురించి అతనికి.. అతని కుటుంబం గురించి నాకు తెలిసే క్లోజ్‌నెస్ అయితే లేదు. పాపం ఆయనతో ఎవరైనా అని ఉండవచ్చు. శివాజీకి ఓ కూతురు ఉంది.. ఇంకా చాలా మాట్లాడుకుని ఉండొచ్చు. యూట్యూబ్‌లలో శివాజీ రెండో పెళ్లాన్ని మీరు చూశారా అని.. తంబ్ నెయిల్స్ పెట్టి.. చివర్లో బ్రూ కాఫీ పెట్టారు. అది ఫన్నీగా ఉంది. బ్యాడ్ అని అనడం లేదు కానీ.. నాకు మొదటి నుంచి జరిగేది ఇదే. నేనేంటో తెలియకుండా కామెంట్స్ చేస్తారు. వాళ్లది తప్పని నేను అనడం లేదు. సమీర్‌కి నా కూతురు ఉందని ఎలా తెలిసిందో ఏమో. నాకు ఇంకో పెళ్లి అయ్యి.. రెండో పెళ్లానికి కూతురు ఉందని తెలిసిందేమో. ఈసారి నాకు సమీర్ కనిపించనప్పుడు.. నా పాస్ నా ఫ్యామిలీ వివరాలన్నీ చూపిస్తా. అతనికి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతే తప్పితే.. నాకు కూతురందనేది నిజం కాదు’’ అంటూ చెప్పుకొచ్చారు.

Read More..

రాముడు అయోధ్యలోనే ఉంటాడా? కరోనా కంటే డేంజర్ వ్యాధులొస్తాయి: బిగ్‌బాస్ శివాజీ

Advertisement

Next Story