పవన్ కళ్యాణ్ లో ఇలాంటి కోణం కూడా ఉందా.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన శివాజీ రాజా

by Prasanna |   ( Updated:2024-03-29 10:04:04.0  )
పవన్ కళ్యాణ్ లో  ఇలాంటి కోణం కూడా ఉందా.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన శివాజీ రాజా
X

దిశ, సినిమా: సినీ పరిశ్రమలో నటీనటులు మధ్య గొడవలు, మాట తేడా రావడం సహజం. ఇవి కొందరికి వారి జీవితాల్లో బాధను మిగులుస్తాయి. ఇంకా చెప్పాలంటే చిన్న గొడవలు కాస్తా పెద్దవి అయి బంధాలు కూడా తెగిపోతాయి. అలా చిన్న విషయాల దగ్గర మనస్పర్థలు వచ్చి విడిపోయిన వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా, నాగబాబు కూడా ఒకరు. ఒకప్పుడు వీరిద్దరి మంచి స్నేహితులు. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు వారి మధ్య మాట పలకరింపు కూడా లేదు.. దాని వెనుక కారణం బయటపడింది. తాజాగా ఓ ఇంటర్యూలో శివాజీ రాజా షాకింగ్ నిజాలు వెల్లడించారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

"నేను నాకు ఇష్టమైన దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అసలు నాగబాబుకు, నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు.. కానీ, మా మధ్య దూరం పెరిగింది. కారణం ఏంటని చాలా సార్లు అడగాలనిపించింది.. ఇప్పుడు అడిగితే అసలు బాగోదు.. అడిగే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. పవన్ కళ్యాణ్ ఒకరోజు నా ఆఫీస్‌ దగ్గరికి వచ్చి గొడవ చేసి..నేను మిమ్మల్ని ప్రెసిడెంట్ అవ్వనివ్వను మొఖం మీదే అన్నాడు. నాకే మంచిది కదా.. ఒకే నేను కూడా రెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను. అసలు ఆయన నా ఆఫీసుకి ఎందుకొచ్చాడో ఇప్పటికీ నాకు తెలీదు. వచ్చి రావడంతో రాఘవేంద్ర రావుకు, సురేశ్ బాబుకు కాల్ చెయ్ అన్నాడు. వారు నాకు టచ్ లో లేరని చెప్పాను నాకు అన్యాయం జరిగింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారని అడిగాడు. అప్పుడు శివాజీ రాజా మూవీ ఆర్టిస్ట్‌కు, ఛాంబర్‌కు సంబంధం లేదు అంటూ" పవన్ కళ్యాణ్ చేసిన గొడవ గురించి బయటపెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ మా సార్ కి కొంచం తిక్క ఎక్కువ.. ఓ.. ఊగిపోతూ ఉంటాడు, మరి కొందరు పవన్ కళ్యాణ్ లో ఇలాంటి కోణం కూడా ఉందా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

జనసేనా పార్టీలో చేరనున్న అనసూయ..! క్లారిటీ ఇచ్చిన యాంకరమ్మ

Advertisement

Next Story