షారుఖ్ మీరనుకున్నంత మంచోడేమీ కాదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |
షారుఖ్ మీరనుకున్నంత మంచోడేమీ కాదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు హోరాహోరిగా జరుగుతున్నాయి. గత రాత్రి (బుధవారం) ఢిల్లీ, కలకత్తా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కలకత్తా (KKR) ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు నమోదు చేసింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. కోల్‌కత్తా నైట్ రైడర్స్ చేతిలో ఢిల్లీ జట్టు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఓనర్స్‌గా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, జుహీ చావ్లా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే జుహీ షారుఖ ఖాన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

అయితే.. కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో షారుఖ్ ఖాన్ జుహీ చావ్లాపై సీరియస్ అయ్యారట. ఈ విషయం గురించి నటి జుహి చావ్లా మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి షారుఖ్ ఖాన్ మీరు అనుకున్నంత మంచి వ్యక్తి కాదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమ్ సరిగ్గా ఆడకపోతే అతడు సీరియస్ అవుతాడు. ఆ సమయంలో నాపై కూడా కోప్పడ్డాడు. ఈ విషయాన్ని జట్టుకు చెప్పని నేను షారుఖ్‌తో అన్నాను. అంతే కాదు.. చాలా మంది యజమానులకు ఇదే వర్తిస్తుంది. మ్యాచ్ ఆడుతున్న సమయంలో వారిని చూడలేక చెమటలు కూడా పడతాయి’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story