Big Boss: టాస్క్‌లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు!

by Hamsa |
Big Boss: టాస్క్‌లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు!
X

దిశ, సినిమా: బుల్లితెర ప్రేక్షకులకు ఫేపరెట్ టీవీ షోగా బిగ్‌బాస్ నిలిచిందనడంతో అతిశయోక్తి లేదు. తెలుగు, హిందీ , కన్నడ, మలయాళ, తమిళ ఇలా ప్రముఖ భాషల్లో ఈ షో సక్సెస్‌ ఫుల్‌గా పలు సీజన్లు పూర్తి చేసుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఎనలేని ప్రేక్షకాదరణను పొందడంతో పాటు అందరినీ అలరిస్తోంది. అయితే ఇప్పటికే తెలుగులో ఎనిమిదో సీజన్ మొదలై ఐదు వారాలు పూర్తి చేసుకుంది. అలాగే హిందీ, తమిళంలో తొందరలోనే స్టార్ట్ కాబోతుంది.

అయితే ఇటీవల కన్నడలో కూడా బిగ్‌బాస్ సీజన్ 11 గ్రాండ్‌గా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో రోజు రోజుకు చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో..తాజాగా, కన్నడ బిగ్‌బాస్ హౌస్‌లో అపశ్రుతి చోటుచేసుకున్నట్లు సమాచారం. టాస్క్‌లో భాగంగా ఇద్దరు కంటెస్టెంట్స్‌ గాయపడ్డారని తెలుస్తోంది. దీంతో వారిని వెంటనే హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం.

టాస్క్‌లో గాయపడిన తివిక్రమ్, గోల్డ్ సురేశ్‌లకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌తో పాటు ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Next Story

Most Viewed