ఆడవాళ్లు చెడ్డీలేసుకుని రోడ్లపై తిరగడం నచ్చలేదు: యంగ్ బ్యూటీ

by Hajipasha |   ( Updated:2023-01-17 13:37:43.0  )
ఆడవాళ్లు చెడ్డీలేసుకుని రోడ్లపై తిరగడం నచ్చలేదు: యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సర్గున్ మెహతా షూటింగ్‌లో తప్పా మరెక్కడా ఫొటోలకు ఫొజులివ్వలేనంటోంది. అంతేకాదు జిమ్‌, షాపింగ్‌లకు వెళ్లినపుడు పొట్టి దుస్తులు ధరించి కెమెరాల కంటపడే సంస్కృతిని అస్సలు ఇష్టపడనన్న ఆమె.. తాను మాత్రం బయటకెళ్లినపుడు శరీరానికి తగిన దుస్తులే వేసుకుంటానని చెప్పింది. 'నేను ఎల్లప్పుడూ ట్రాక్‌సూట్‌లోనే బయటకు వెళ్తా. షూటింగ్ చేసినంత సేపు మాత్రమే పాత్రకు సరిపడ బట్టలు వేసుకుంటాను. ఎందుకంటే ప్రజలు మన పని గురించి మాత్రమే మాట్లాడాలని కోరుకుంటా. జిమ్ లేదా విమానాశ్రయం తదితర ప్లేసుల్లో ఎలా కనిపించిందనే దాని గురించి డిస్కస్ చేయడం నచ్చదు. ముఖ్యంగా ఆడవాళ్లు చెడ్డీలేసుకుని రోడ్లపై తిరిగితే చూడలేను. మన వ్యక్తిగత విషయాలను మీడియాకు దూరంగా ఉంచడమే మంచిదని భావిస్తా' అంటూ తన ఫీలింగ్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి : నాకు పెళ్లి అయింది.. దూరం జరుగు అంటున్న Rakhi Sawant

Advertisement

Next Story

Most Viewed