Samantha: గుడ్ న్యూస్ చెప్పిన బ్యూటీ.. కెరీర్‌కు సంబంధించిన విషయం చెబుతూ ఆసక్తికర కామెంట్స్!

by Hamsa |
Samantha: గుడ్ న్యూస్ చెప్పిన బ్యూటీ.. కెరీర్‌కు సంబంధించిన విషయం చెబుతూ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజుల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా స్టార్ బ్యూటీగా చెరగని ముద్ర వేసుకుని ఇండస్ట్రీలో కొద్ది కాలం కొనసాగింది. కానీ 2023లో మయోసైటీస్ వ్యాధి రావడంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటుంది. ఖుషీ సినిమా తర్వాత నుంచి నటనకు దూరం అయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు షేర్ చేస్తుంది. అలాగే హెల్త్‌కు సంబంధించిన విషయాలు చెబుతూ ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

కొత్త మూవీస్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తావు అని పదే పదే అడగడంతో.. ఇటీవల మా ఇంటి బంగారం అనే సినిమా అప్డేట్ ఇచ్చింది. కానీ దీనికి సంబంధించిన విషయాలు తెలపలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత గుడ్ న్యూస్ తెలిపింది. తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. దీని కోసం నేను మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ, గుర్రపు స్వారీ, కత్తి సాము వంటివి నేర్చుకుంటున్నాను. ఇందులో భాగంగా చాలా విషయాలను తెలుసుకున్నాను. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సమంత రీ ఎంట్రీ తర్వాత ఫస్ట్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed