భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నా - Samantha ఎమోషనల్ పోస్ట్

by sudharani |   ( Updated:2022-10-29 14:37:59.0  )
భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నా - Samantha ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా సమంత బలహీనమైన ఆటో ఇమ్యూన్ సిస్టమ్, డయాబెటీస్‌తో బాధపడుతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలు నిజం చేసేలా సామ్ ఓ ఎమోషనల్ పోస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో.. తాను మయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది. అయితే ఇది ఆటోఇమ్యూన్ సిస్టంకి సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవారి కండరాలు వాపుకు గురవుతాయి. గాయాలైనా, ఇన్ ఫెక్షన్లు వచ్చినా, రోగనిరోధక శక్తి క్షీణించిన, ఈ వ్యాధికి గురవుతారు. అదే విధంగా ఈ వ్యాధి వచ్చిన వారు తొందరగా అలసిపోతారు. శ్వాస తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఒక్కోసారి అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. ఇక పరిస్థితి చేయి దాటితే మరణం కూడా సంభవిస్తుంది. ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది సమంత. ఇక తను షేర్ చేసిన పిక్‌తో పాటు తన కండిషన్ గురించి కూడా ఇన్ఫర్‌మేషన్ ఇచ్చింది. ''ఆమె పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్ హామీ ఇచ్చారు'' అని సామ్ వివరించింది. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తొందరగా కోలుకుని మా ముందుకు రావాలి అంటూ పోస్టులు పెడుతున్నారు.

Read more:

1.Samantha వ్యాధిపై స్పందించిన Jr NTR

Breaking News.... రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత?

Advertisement

Next Story

Most Viewed