సింపతీ క్వీన్ అంటూ నెట్టింట ట్రోల్స్.. స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత!

by Hamsa |   ( Updated:2024-03-17 07:46:55.0  )
సింపతీ క్వీన్ అంటూ నెట్టింట ట్రోల్స్.. స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతుంది. కాస్త మయోసైటీస్ వ్యాధి తగ్గడంతో పలు ఈవెంట్స్‌లో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అంతేకాకుండా సమంత సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ రోజురోజు గ్లామర్ విషయంలో తగ్గేదెలా అన్నట్టుగా ఫొటోలు షేర్ చేస్తుంది. అలాగే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని కూడా ప్రకటించి మంచి ఆఫర్ కోసం చూస్తూనే పలు యాడ్స్ చేస్తుంది.

అయితే శాకుంతలం సినిమా చేసినప్పుడు ప్రమోషన్స్‌లో ఏడ్చింది. దీంతో సింపతీ కొట్టేసి హిట్ అందుకోవాలని చూస్తుందని నెటిజన్లు ఆమెకు సింపతీ క్వీన్ అనే బిరుదు ఇచ్చి మరీ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ నెటిజన్లు ఇచ్చిన బిరుదు పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నాకు సింపతీ క్వీన్ బిరుదును నేను అంగీకరిస్తున్నాను. శాకుంతలం సినిమా విడుదల సమయంలో వ్యాధి గురించి చెప్పడం వల్ల సింపతీ కోసం అలా చేశాను అని అంతా అనుకున్నారు. కానీ అందులో నిజం లేదు.

ప్రమోషన్స్ చేయాల్సిన బాధ్యత నాపై ఉన్నప్పుడు చేయకపోతే ఎలా అందుకే ఓ కార్యక్రమానికి వచ్చాను. అయితే అప్పుడు కూడా స్టేజిపై నేను సంతోషంగా కనిపించడంతో నేను బాగున్నా కానీ వ్యాధి ఉన్నట్లు నటించానని అన్నారు. కానీ ఆరోగ్యం బాగాలేదని మీడియా ముందుకు నీరసంగా రాలేను కదా.. అందుకే బాధను లోపల దాచుకుని పైకి నవ్వుతూ కనిపించాను. దాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకుని సింపతీ కోసమే అవన్నీ చేశానంటూ పుకార్లు పుట్టించారు. నా అనారోగ్య కారణంగా నేను పడిన ఇబ్బందులు అర్థంకాక ట్రోల్స్ కూడా చేశారు. ఆ సమయంలో అవన్నీ నన్ను కాస్త ఎక్కువ ఒత్తిడికి గురి చేశాయి. కానీ కొద్ది రోజుల తర్వాత అవన్నీ మర్చిపోయి నా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాను. అందువల్లనే కోలుకుని మీ అందరి ముందుకు రాగలిగాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More..

మెడలో పాముతో షాకిచ్చిన స్టార్ హీరోయిన్?

Advertisement

Next Story

Most Viewed