- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: నేను నీ మాటను తీసుకున్నాను థాంక్యూ అంటూ సమంత పోస్ట్.. ఎవరి గురించంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ పోస్టులు పెడుతోంది. అయితే సామ్ ప్రజెంట్ తమిళనాడులోని కోయంబత్తూర్‌లో గల ఈషా ఫౌండేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ తన విలువైన సమయాన్ని గడుపుతూ పలు ఫొటోలు షేర్ చేస్తుంది. అంతేకాకుండా ఈషా ఫౌండేషన్ కూడా తనకు ఇల్లు లాంటిదేనని ఇటీవల ఓ పోస్ట్ కూడా పెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా, సమంత దేవినవరాత్రి పూజల్లో పాల్గొంది.
ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘నీ మాటను నేను తీసుకున్నాను. థాంక్యూ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రజెంట్ సమంత పూజలో నిమగ్నమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అవి చూసిన వారు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కాగా, సమంత వ్యక్తిగత జీవితంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంత, విడాకుల గురించి మాట్లాడటంతో పాటు అక్కినేని కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడింది.
ఇటు రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో కొండా సురేఖ కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సమంత, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమలతో పాటు టాలీవుడ్ నటీనటులంతా కొండా సురేఖపై ఫైర్ అవుతూ పోస్టులు పెట్టారు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సమంత, నాగార్జునకు సపోర్ట్‌గా నిలిచారు. అయితే కొండా సురేఖపై నాగ్ పరువు నష్టం దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. కానీ విచారణ వాయిదా పడినట్లు సమాచారం.