Samantha: మొక్కులు చెల్లించుకుంటున్న.. సమంత

by Prasanna |   ( Updated:2023-02-15 04:11:20.0  )
Samantha: మొక్కులు  చెల్లించుకుంటున్న..  సమంత
X

దిశ, వెబ్ డెస్క్ : కష్టాలు అనేవి మనకి చెప్పి రావు.. కష్టాలు వచ్చినపుడు మనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. మనకి ఆ సమయంలోనే దేవుళ్లందరూ గుర్తొస్తారు. ఆ కష్టాల నుంచి బయట పడేందుకు.. ధైర్యంగా ముందుకు అడుగు వేసేందుకు కదిలేందుకు.. దేవుడి వైపుకు కదులుతాము . ఆ దేవుణ్ణి నమ్ముకుని ..ఆయన సేవలో ఉంటె .. ప్రశాంతత పొందేలా చేస్తాడని భక్తులు నమ్ముతుంటారు.

ఇప్పుడు మన సామ్ కూడా అదే ఫాలో అవుతుంది. పళని సుబ్రమణ్యస్వామి వారి గుడిలో తన మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళింది. ఆమెకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ .. చేతి నిండా సినిమాలు .. ఇలా ప్రశాంతంగా గడుపుతున్న జీవితంలో సమంతకు, భర్తతో విడాకులవ్వడం ఆమెను బాగా కృంగతీసింది. ఆ బాధ నుంచి బయటపడేందుకు సామ్ రక రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ప్రయోజనం లేక పోయింది. అదే ఆలోచిస్తూ ఆమెకు మయోసైటిస్ వ్యాధి కూడా వచ్చింది. సమంత రీసెంట్ జిమ్ వర్కౌట్స్ చూస్తుంటే .. ఆరోగ్యం కూడా సెట్ అయినట్టు తెలుస్తుంది.. దీంతో స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నట్లు ఉంది.

ఇవి కూడా చదవండి : ఆ భయంతో సమంత పుష్ప2కి దూరంగా ఉందా?

Advertisement

Next Story

Most Viewed