Samantha: ఇండస్ట్రీలో ప‌ద‌మూడేళ్లు పూర్తిచేసుకున్నా స‌మంత.. ఎమోషనల్ పోస్ట్

by Prasanna |   ( Updated:2023-02-27 09:48:38.0  )
Samantha: ఇండస్ట్రీలో ప‌ద‌మూడేళ్లు పూర్తిచేసుకున్నా స‌మంత.. ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అక్కర్లేదు. హీరోలకు ధీటుగా తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక తొలి చిత్రం ‘ఏ మాయ చేశావే’ రిలీజై ప‌ద‌మూడేళ్లు పూర్తయ్యాయి. 2010 ఫిబ్రవ‌రి 26న వచ్చిన ఈ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స‌మంత.. తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను మెప్పించింది. ఇక త‌న ప‌ద‌మూడేళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. ‘నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది నా అభిమానుల ప్రోత్సాహం వ‌ల్లే. నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి ప‌ద‌మూడేళ్లు పూర్తయినప్పటికీ ఇప్పుడే కొత్త జర్నీ మొద‌లుపెట్టిన ఫీలింగ్ క‌లుగుతోంది’ అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

నాగచైతన్యకు ఇంకా సమంతపై ప్రేమ పోలేదు.. సాక్ష్యం ఇదే అంటున్న ఫ్యాన్స్

Advertisement

Next Story