Sai Pallavi: ముంబైలో మెరిసిన సాయిపల్లవి.. ఆ వీడియో చూసి ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

by Prasanna |   ( Updated:2023-03-30 12:24:03.0  )
Sai Pallavi: ముంబైలో మెరిసిన సాయిపల్లవి.. ఆ వీడియో చూసి ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి చాలా గ్యాప్ తర్వాత నెట్టింట హల్ చల్ చేసింది. కొంతకాలంగా ఎలాంటి సినిమా అప్‌డేట్ ఇవ్వకపోవడంతోపాటు ఏ ఈవెంట్‌కు హాజరవ్వలేదు. అంతేకాదు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లోనూ సైలెంట్ అయిపోయింది. దీంతో సాయి పెళ్లి చేసుకుంటుందా? సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా? అంటూ ప్రేక్షకులు రకరకాల చర్చలకు దిగారు. అయితే దీనిపై ఇంతవరకూ స్పందించని నటి.. తాజాగా ముంబైలో తలుక్కున మెరిసింది. విషయానికొస్తే.. ఆమె నటించిన ‘గార్గి’ గతేడాది విడుదలై మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ముంబైలో జరిగిన ‘క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్’ ప్రధానోత్సవాల కార్యక్రమానికి హాజరైన ఆమె.. ‘గార్గి’ మూవీకిగానూ ఉత్తమ నటి అవార్డ్ కైవసం చేసుకుంది. ఇక ఈ వేడుకకు రెడ్ సారీలో వచ్చిన సాయి పల్లవి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story