- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
VIJAY DEVARAKONDA-RASHMIKA:విజయ్ దేవరకొండపై షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. విజయ్ దేవరకొండపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఎవరితోనైన ఫస్ట్ టైం మాట్లాడాలంటే చాలా భయమేస్తుందని తెలిపింది. ఒకట్రెంరోజులు అయితే గానీ వారితో కలిసిపోవడం కష్టం అంటూ వెల్లడించింది. అయితే గీతా గోవిందం చిత్ర షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించడానికి చాలా పడిపోయానని, కానీ ఆయన చాలా కూల్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది.
విజయ్ సెట్‌లో ఉంటే వెదర్ పాజిటివ్‌గా ఉంటుందని చెప్పింది. మొదట్లో భయపడ్డాను కానీ.. తర్వాత ఆయనతో కలిసి నటించడం చాలా ఈజీ అనిపించిందని, కాగా మూవీ షూటింగ్ సాఫీగా సాగిపోయిందని గుర్తుచేసుకుంది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవ్వడంతో బ్యూటిఫుల్ కపుల్ అంటూ క్యూట్ కామెంట్లు పెడుతున్నారు.
ఇక నేషనల్ క్రష్ రష్మిక అండ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో పాటు డియర్ కామ్రేడ్ చిత్రంలో కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. ఓసారి లవ్, ఓసారి ఎంగేజ్‌మెంట్, మరోసారి ఏకంగా పెళ్లే చేసుకోబోతున్నారంటూ పలువురు పలు రకాలుగా నెట్టింట ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. మరీ ఈ వార్తలు ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ విజయ్-రష్మిక ప్రస్తుతం బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. పూర్తి దృష్టి తమ కెరీర్‌పైనే పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక రష్మిక మందన్న.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-1 లో శ్రీవల్లి పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప పార్ట్-2 చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. అలాగే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.