Rashmika Mandanna: డిసెంబ‌ర్ 6న‌ పెద్ద ప‌రీక్ష ఎదుర్కోబోతున్న ర‌ష్మిక‌.. ఆ రోజు ఏం జ‌ర‌గ‌నుందంటే..?

by Prasanna |
Rashmika Mandanna: డిసెంబ‌ర్ 6న‌ పెద్ద ప‌రీక్ష ఎదుర్కోబోతున్న ర‌ష్మిక‌.. ఆ రోజు ఏం జ‌ర‌గ‌నుందంటే..?
X

దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే గ్యాప్ లేకుండా సినిమాలు, యాడ్స్ చేస్తూ కెరియర్లో ఫుల్ బిజీ అయ్యింది. ఓ వైపు టాలీవుడ్‌లో ఇంకోవైపు బాలీవుడ్‌లో న‌టిస్తూ రెస్ట్ లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే, ఈమెకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ మూవీలో ర‌ష్మిక కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ పెద్ద విజ‌యం సాధించ‌డంతో ర‌ష్మిక‌ లైఫ్ స్టైలే మారిపోయింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప‌-2’ మూవీ రాబోతుంది. ఇది ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. అల్లు అర్జున్ , ర‌ష్మిక‌ల‌పై ముఖ్య స‌న్నివేశాల‌ను షూట్ చేస్తున్నారు. నిజానికి ఈ మూవీ ఆగ‌స్టు 15న రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో డిసెంబ‌ర్ 6కు పోస్ట్ పోన్ చేసారు.

ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌లో ఛావా అనే సినిమాలో ర‌ష్మిక న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా డిసెంబ‌ర్ 6 రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇలా రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఇక, కొద్దీ రోజులు సోషల్ మీడియాలో రష్మిక పేరు మారుమోగిపోతుంది. వీటిలో ఏ సినిమా ర‌ష్మిక‌కు కలిసి వస్తుందో చూడాలి మరి.. అది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!

Advertisement

Next Story

Most Viewed