మందు గ్లాస్‌తో దర్శనం ఇచ్చిన రష్మీ.. వైరల్ అవుతున్న ఫోటో!

by Disha Web Desk 8 |
మందు గ్లాస్‌తో దర్శనం ఇచ్చిన రష్మీ.. వైరల్ అవుతున్న ఫోటో!
X

దిశ, సినిమా : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర యాంకర్‌గా ఈమె మంచి క్రేజ్ ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈమె పలు సనిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. ముఖ్యంగా రష్మీ సుధీర్ మధ్య కెమిస్ట్రీతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. వీరి జంట అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొన్ని రోజుల పాటు వీరు బుల్లితెరను ఏలారనే చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం సుధీర్ సినిమాల్లో బిజీ అయిపోగా, రష్మీ సినిమాలు, యాంకరింగ్ చేస్తూ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్మీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులతో ముచ్చటించడమే కాకుండా, తన హాట్ హాట్ ఫోటో షూట్‌తో కుర్రకారు మదిని దోచేస్తుంటుంది. అయితే తాజాగా రష్మీ తన పుట్టినరోజు జరుపుకుంది. తన స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఈ బ్యూటీ, అక్కడే ఎంజాయ్ చేస్తూ, బర్త్‌డే జరుపుకున్న ఫోటోలను షేర్ చేసింది. అయితే అందులో మందు గ్లాస్‌తో ఉన్న రష్మీ ఫొటోను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ముందు మందు గ్లాస్ పెట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతుంది. రష్మీ మందు గ్లాస్‌తో తన పుట్టిన రోజును గ్రాండ్‌గా జరుపుకుంటుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక రష్మీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఓ పారిశ్రామిక వేత్తను ఆమె త్వరలో వివాహం చేసుకోబోతుందంట. కాగా, ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Read More...

నా భర్తను మిస్ అవుతున్నా.. తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed