- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IAS కావాలనుకొని, హీరోయిన్‌గా మారిన బ్యూటీ ఎవరో తెలుసా?
దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకొని మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో రాశిఖన్నాకు అంతగా ఆఫర్స్ రావడం లేదు. థాంక్యూ సినిమా తర్వాత రాశిఖన్నా చేతిలో తెలుగు సినిమాలు అంతగా లేనట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో సినిమాలతో బిజీ అయినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోస్‌తో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో తమ అభిమానులతో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను ఇండస్ట్రీలోకి రాకముందు, ఐఏఎస్ కావాలి అనుకున్నానంటూ తెలిపింది. కానీ అనుకోకుండా హీరోయిన్‌గా మారాను, కానీ నేను చిన్నప్పటి నుంచి చదువులో ముందు ఉండేదాన్ని ఐఏఎస్ కావాలని అనుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.