Rajinikanth: చిక్కుల్లో రజినీకాంత్ ‘వెట్టైయాన్’ మూవీ.. కారణం ఏంటంటే?

by Hamsa |   ( Updated:2024-10-04 15:03:05.0  )
Rajinikanth: చిక్కుల్లో రజినీకాంత్ ‘వెట్టైయాన్’ మూవీ.. కారణం ఏంటంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. విజయాల గురించి ఆలోచించకుండా గ్యాప్ తీసుకోకుండా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్రజెంట్ రజినీకాంత్, ‘జై భీమ్’ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్’. ఇందులో మలయాళీ బ్యూటీ మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అన్ని అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అంతేకాకుండా వెట్టైయాన్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలో.. తాజాగా, ‘వెట్టైయాన్’ సినిమా చిక్కుల్లో పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తి తమిళనాడులోని మధురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఎన్‌కౌంటర్ హత్యలను ప్రోత్సహించే విధంగా కొన్ని సీన్స్ ఉన్నాయని అక్రమ ఎన్‌కౌంటర్లకు దారితీస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సినిమా విడుదల కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరినట్లు తెలుస్తోంది.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ విక్టోరియా గౌరీల ధర్మాసనం సీబీఎఫ్సీ, లైకా ప్రొడక్షన్స్ కు నోటీసులు జారీ చేశారని టాక్. సినిమాపై మధ్యంతర నిషేధం విధించాలన్న విన్నపాన్ని మాత్రం నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ విడుదల అవుతుందా లేక వాయిదా పడుతుందా అని నిరాశ చెందుతున్నారు.

Read More...

Rajinikanth: అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సూపర్‌స్టార్


Advertisement

Next Story

Most Viewed