తల్లిదండ్రులైన జబర్దస్త్ రాకేష్-సుజాత.. హాస్పిటల్‌లో ఆ సంఘటన ఓ అద్భుతం అంటూ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-10-05 07:15:40.0  )
తల్లిదండ్రులైన జబర్దస్త్ రాకేష్-సుజాత.. హాస్పిటల్‌లో ఆ సంఘటన ఓ అద్భుతం అంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. జోడిగా బోలేడన్నీ స్కిట్స్ చేసి ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించారు. రీల్ లైఫ్‌లో జంటగా నటించిన వీరిద్దరూ జబర్దస్త్ షోలోనే ప్రేమలో పడ్డారు. వేదికపై తమ ప్రేమ విషయాన్ని వెల్లడించడంతో పాటు పెద్దలను ఒప్పించారు. గత ఏడాది ఫిబ్రవరి 24న గ్రాండ్‌గా తిరుమలలో ఏడడుగులు వేశారు. అయితే ఇటీవల సుజాత ప్రెగ్నెంట్‌గా ఉన్నట్లు శ్రీమంతం ఫొటోలు కూడా నెట్టింట షేర్ చేశారు. దీంతో అంతా వీరికి పాప లేదా బాబు పుట్టారా అనే అనుమానంలో ఉండిపోయారు. పలు పోస్టులు పెట్టి ఎవరు పుట్టారో రివీల్ చేయాలని వారిని ప్రశ్నించారు.

ఈ క్రమంలో.. తాజాగా, రాకింగ్ రాకేష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తాను తండ్రి అయినట్లు వెల్లడించాడు. ‘‘ఈ నవరాత్రి పర్వదినాలలో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. హాస్పిటల్‌లో నేను అనుభవించిన ఆ సంఘటన ఓ అద్భుతం. మా అమ్మని ఎంతో బాధ పెడుతూ ఈ లోకంలోకి వచ్చిన నేను ప్రత్యక్షంగా ఆ బాధను చూస్తూ తండ్రినయ్యాను. ఈ జన్మలో ఏ బాధ నీ దరిచేరనివ్వనమ్మా.

నా బాధలో నా ఆనందంలో సగమైన నా సుజాత ఓ బిడ్డకి తల్లిగా.. నా కుటుంబానికి మరో అమ్మగా పరిపూర్ణ స్త్రీగా మారిన ఓ అద్భుత క్షణం. ఆ దేవుడు ఆశీస్సులతో త్వరలో కోల్కొని నీ షూటింగ్‌లో బిజీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను, సుజాతని మొదటి నుంచి మీ ఆశీస్సులతో పాజిటివ్ ఎనర్జీతో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. ఇలానే మీ ఆశీస్సులు మా పాప మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా తమ కూతురుతో తీసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed