సిద్దుకు పెద్ద ముద్ద పెట్టా.. అనుపమ కామెంట్స్‌కు నిర్మాత షాక్!

by Jakkula Samataha |   ( Updated:2024-03-27 15:45:28.0  )
సిద్దుకు పెద్ద ముద్ద పెట్టా.. అనుపమ కామెంట్స్‌కు నిర్మాత షాక్!
X

దిశ, ఫీచర్స్ : అనుపమ ఫ్యాన్స్, సిద్దు జొన్నలగడ్డ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా టిల్లు స్వ్కేర్. డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో అనుపమ ఎప్పుడూ కనిపించని విధంగా, చాలా బోల్డ్‌గా, రొమాంటిక్‌గా కనిపించనుంది. దీంతో టిల్లు స్వ్కేర్‌కు సంబంధించిన ప్రతీది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టిల్లు స్క్వేర్ టీం ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కాగా, అందులో అనుపమ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంటర్వ్యూలో అనుపమ తనకు ఏ వంటలు చేయవచ్చో తెలిపింది. దీంతో అది విన్న సిద్ధు,ప్రతి రోజూ షూటింగ్‌లో అనుపమకు మంచి మంచి వెరైటీస్ పెట్టేవాడిని, కానీ నాకు ఒక్క గుడ్డు పెట్టిన పాపాన పోలేదంటూ ధీనంగా అడిగాడు. అప్పుడు అను ఇప్పుడు పెడుతాను అని చెప్పగా, ఇంకెందుకు అంటూ రివర్స్ అయ్యాడు. దానికి అనుపమ పెద్ద ముద్ద పెట్టాను కదా అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో అనుపమ నుంచి ఆ మాట విన్న సిద్దు, నిర్మాత నాగ వంశీ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ప్రస్తుతం అనుమప చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed