ట్రెడిషనల్ లుక్‌తో అదరగొడుతోన్న పూజా హెగ్దే.. పిక్స్ వైరల్..!!

by Anjali |   ( Updated:2024-01-23 04:09:43.0  )
Pooja Hegde
X

దిశ, సినిమా: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన స్టార్టింగ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ పూజా హెగ్డే. కానీ ప్రస్తుతం ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. చివరిసారిగా కేసీకా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో నటించింది. చాలా గ్యాప్ తర్వాత దేవ చిత్రంలో నటిస్తోంది. బుట్టబొమ్మ స్టార్ హీరోల సరసన నటించిన ఫలితం బెడిసి కొడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ కలిసి రావడం లేదు. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి.

సినిమాల్లో అలరించనప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన గ్లామర్, ట్రెడిషన్‌ లుక్‌తో నెటిజన్లను కుదురుగా ఉండనివ్వదు. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ మెరుపులతో యువతను చూపుతిప్పుకోనియకుండా చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ రెట్రో లుక్‌లో దర్శనమిచ్చింది. గ్రీన్, లైట్ పింక్ హాఫ్ శారీ కట్టుకొని.. కొప్పునిండా పూలు పెట్టుకుని స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిచ్చింది. పూజా.. తన బ్యూటీఫుల్ పిక్స్ ఫ్యాన్స్‌తో పంచుకోగా.. ‘‘సంప్రదాయ దుస్తుల్లో చాలా పద్ధతిగా ఉన్నారు, పద్ధతికే మారుపేరుగా మెరిసిపోతున్నారు మేడమ్, సో క్యూట్’’ అంటూ బుట్ట బొమ్మ అందాన్ని పొగిడేస్తున్నారు జనాలు. లైక్స్, కామెంట్లతో పాటు పూజా హెగ్డే ఫొటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed