Oscar 2023: ఆస్కార్ వేడుకకు ఎన్టీఆర్ భార్య ఎందుకు హాజరు కాలేదంటే?

by Prasanna |
Oscar 2023: ఆస్కార్ వేడుకకు ఎన్టీఆర్ భార్య ఎందుకు హాజరు కాలేదంటే?
X

దిశ, సినిమా: రాజమౌళి దర్శకత్వంలో , ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘RRR’ సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ వేడుకలలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. రాజమౌళి, కార్తికేయ, రామ్ చరణ్ వారంతా కూడా తమ భార్యలతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. కానీ తారక్ భార్య లక్ష్మీ ప్రణతి మాత్రం ఈ వేడుకలో భాగం కాలేదు. అయితే ముందు నుంచి ఇద్దరు కలిసి ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లాల్సి ఉండగా, చివరి నిమిషంలో.. తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకు ఆలస్యంగా వెళ్లారు. అయితే లక్ష్మీ ప్రణతి కూడా వెళ్లాల్సి ఉండగా ఆమె హెల్త్ ఇష్యూ కారణంగా చివరి నిమిషంలో అమెరికా పర్యటన క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story