ముసలోడిలా కనిపిస్తున్న నితిన్... ఇంత దారుణంగా మారిపోయాడేంటి? (వీడియో)

by Sujitha Rachapalli |
ముసలోడిలా కనిపిస్తున్న నితిన్... ఇంత దారుణంగా మారిపోయాడేంటి? (వీడియో)
X

దిశ, సినిమా: హీరో నితిన్ వరుస డిజాస్టర్స్ అందుకుంటున్నాడు. దీంతో కథానాయకుడిగా ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ' సార్ ' మూవీతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుములతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ' రాబిన్ హుడ్ ' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఆమె బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా సెట్స్ నుంచి ఓ టీజింగ్ వీడియో షేర్ చేశాడు డైరెక్టర్.

ఓ సీన్ చిత్రీకరణలో కారులో నితిన్, శ్రీలీల కూర్చుని ఉండగా... వీడియో రికార్డు చేశాడు. దీనికి ఫిల్టర్ యాడ్ చేయగా.. నితిన్ ముసలోడిలా కనిపిస్తున్నాడు. కానీ లీల మాత్రం ఫిల్టర్ లో కూడా అందంగానే కనిపిస్తుంది. దీన్ని చూసిన జనాలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ' అన్న మనమే ముసలోల్లం అయిపోతాం. అమ్మాయిలు అవరు. ఎందుకంటే బాధ్యతలన్నీ మనవే ' అంటున్నారు. ఇంకొందరు ఇలా కూడా అదిరిపోయావ్ అని చెప్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed