- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nindu Noorella Saavasam 5thSep Episode: అమర్‌ని ఢీకొట్టిన భాగమతి.. తర్వాత ఏం జరగబోతోంది?
దిశ, సినిమా: రోజురోజుకీ ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతున్నజీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. ఒక ఆర్మీ లెఫ్టినెంట్ కుటుంబ కథతో సాగుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అరుంధతి చనిపోవడంతో కథలో ట్విస్ట్ ఇచ్చిన ఈ సీరియల్ ఈరోజు(సెప్టెంబర్05) ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకుందాం..
పిల్లల ప్లాన్ తెలియని రాథోడ్ వాళ్లని తీసుకుని స్కూల్‌కి బయలుదేరతాడు. కార్ ఎక్కిన పిల్లలు తేడాగా మాట్లాడటంతో రాథోడ్‌కి ఏం అర్థం కాదు. కొంతదూరం వెళ్లాక పెన్ కొనుక్కోవాలని కారు దిగుతుంది అంజలి. ఒకరి తర్వాత ఒకరు నలుగురూ వెళతారు. ఎంతసేపటికీ పిల్లలు తిరిగిరాకపోవడంతో రాథోడ్ కంగారు పడతాడు.వెంటనే మనోహరికి ఫోన్ చేసి పిల్లలు కనపడటం లేదని చెబుతాడు. పొద్దుట్నుండీ తన కుడి కన్ను కొట్టుకుంటుందని అనుకుంటూ ఉంటుంది మనోహరి. కుడి కన్ను కొట్టుకుంటే ఏదో అశుభం జరగబోతుందని చెబుతుంది నీల. అంతలోనే రాథోడ్ ఫోన్ చేసి పిల్లలు కనపడట్లేదని చెబుతాడు. ఏం చెయ్యాలో అర్థంకాని మనోహరి ఆ విషయాన్ని అమర్‌కి చెప్పొద్దని రాథోడ్‌కి చెప్పి వెంటనే కార్ తీసుకుని పిల్లల్ని వెతకడానికి బయలుదేరుతుంది.
చిత్రగుప్తుడి ద్వారా విషయం తెలుసుకున్న అరుంధతి ఆత్మ పిల్లలు కనపడట్లేదని బాధపడుతుంది. పిల్లలు ప్లాన్ ప్రకారమే ఇంట్లోంచి వెళ్లిపోయారనీ, అదంతా కూడా ఓ కలయిక కోసం జరుగుతున్న ప్రయత్నమనీ చిత్రగుప్తుడు చెప్పడంతో ఆలోచనలో పడుతుంది అరుంధతి. పిల్లలకు ఏం జరగదనీ, వాళ్లు చేరాల్సిన వాళ్ల దగ్గరకే చేరతారని చెబుతాడు చిత్రగుప్తుడు. మనోహరి కార్ తీసుకుని హడావుడిగా వెళ్లడం చూసి కంగారు పడుతుంది అరుంధతి.
పిల్లల్ని స్కూల్లో దింపి కంటోన్మెంట్కి రావాల్సిన రాథోడ్ ఇంకా రాలేదని ఆలోచిస్తుంటాడు అమర్. ఏం జరిగిందో తెలుసుకుందామని రాథోడ్‌కి ఫోన్ చేస్తాడు. పిల్లలు కనపడట్లేదని కంగారుపడుతూ వాళ్లకోసం వెతుకుతున్న రాథోడ్ అమర్ ఫోన్ చేస్తుండటంతో భయపడతాడు. ఫోన్ తీస్తే కచ్చితంగా అమర్‌కి విషయం తెలిసిపోతుందని ఫోన్ ఆన్సర్ చేయడు. ఏం జరిగిందోనని ఆలోచిస్తున్న అమర్‌కి బండి మీద వచ్చి డాష్ ఇస్తుంది భాగమతి. ఎంత కలవొద్దని అనుకుంటున్నా.. మళ్లీ మళ్లీ అమర్ ఎదురుపడటం ఏంటో అర్థంకాని భాగీ తనకి క్షమాపణ చెప్పి అక్కడనుంచి వెళ్లిపోతుంది. లెఫ్టినెంట్ ఆఫీస్‌లో లేరని, ఇప్పుడే బయటకు వెళ్లారని చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతుంది.
రాథోడ్ కంటపడకుండా దాక్కుంటూ తిరిగిన పిల్లలు ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లి కొడైకెనాల్కి టికెట్స్ బుక్ చేయమని అడుగుతారు. టికెట్స్ బుక్ చెయ్యడానికి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా కావాలని చెప్పడంతో రాథోడ్ నెంబర్ ఇస్తుంది అంజలి. పిల్లలు టికెట్స్ బుక్ చేసుకున్న విషయం రాథోడ్‌కి తెలిసిపోతుందా? పిల్లలు కనపడటం లేదని తెలిసిన అమర్ ఏం చేస్తాడు? తెలియాలంటే ఈరోజు, సెప్టెంబర్ 05న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
Read More: Bigg Boss season:7 మొదటివారం నామినేషన్స్‌లో 8 మంది.. ఎవరెవరంటే?