అరియానాను ఆంటీ అన్న నెటిజన్.. అవతల వాళ్ల మీద పడి ఏడుస్తావేంట్రా: గట్టి కౌంటర్ ఇచ్చిన బ్యూటీ

by Anjali |   ( Updated:4 Oct 2023 7:13 AM  )
అరియానాను ఆంటీ అన్న నెటిజన్.. అవతల వాళ్ల మీద పడి ఏడుస్తావేంట్రా: గట్టి కౌంటర్ ఇచ్చిన బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకులకు పరిచమయ్యింది బ్యూటీ ‘అరియానా గ్లోరీ’. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే ఒకప్పుడు స్లిమ్‌గా సన్నగా కనిపించిన ఈ బ్యూటీ కాస్త బరువు పెరగడంతో నెట్టింట ఈ భామను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇటీవల యాంకర్ అనసూయను నెటిజన్లు ఆంటీ అని పిలిచి.. తనకు మండేలా చేశారు. దీంతో హాట్ యాంకర్ గట్టి కౌంటర్ ఇచ్చిపడేసింది. ఇప్పుడు ఇదే పరిస్థితి అరియాను ఎదురయ్యింది. దీనిపై ఈ అమ్మడు స్పందించి..

‘‘నేను ఎలా ఉంటే నీకేంట్రా? ధైర్యముంటే ముందుకొచ్చి మాట్లాడాలి. నచ్చకపోతే అన్ ఫాలో కొట్టాలి. బ్రెయిన్, హార్ట్‌తో ఆలోచించి మాట్లాడాలి. ఎప్పుడూ అవతల వాళ్ళ మీద పడి ఏడుస్తారేంట్రా? అసలు నీకేంటి సమస్య.. ఎవరి జీవితం వాళ్లది, నువ్వేమైనా నా మంత్లీ బిల్స్ పే చేస్తున్నావా? పని లేకపోతే ఏదైనా పని చూసుకోవాలని కానీ ఇలా చిరాకు తెప్పించే కామెంట్లతో మనుషుల్ని రెచ్చగొడతారెంట్రా?’’ అంటూ అరియానా మండిపడుతూ అనసూయ కన్నా డబుల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read More..

ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన మరో హాట్ యాంకర్.. ఎంత ముద్దుగా ఉందో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed