- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెద్ద కోతి.. మహేష్ బాబు ఆమె చేసిన ఈ ఫుడ్ ఇష్టంతో లాగించేస్తాడు: సూపర్ స్టార్‌పై స్టార్ నటుడు సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నరేష్-పవిత్ర లోకేష్ అంటే జనాలకు ఇంకా తొందరగా గుర్తొచ్చే పర్సన్. ఎందుకంటే వీరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్. ఇకపోతే తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూకు హాజరై, ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. తన అలవాట్లు, ఇష్టమైన ఫుడ్, సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇష్టమైన ఫుడ్ గురించి ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘‘హెల్త్ విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ముఖ్యంగా రాగి చెంబుతోనే వాటర్ తాగుతాను. బాదం పప్పులు, జీడి పప్పులు, ఖార్జూరాలు, ఎండు నల్ల ద్రాక్షలు వాటర్ లో వేసుకుని తాగుతాను. నా బ్రేక్ ఫాస్ట్ ఇదే. మా అమ్మ ఉన్నప్పుడు కడుపు నిండా టిఫిన్ పెట్టేది. నేను అప్పుడు చాలా లావు ఉండేవాడ్ని. అమ్మ చనిపోయిందన్న బాధతో 10 కేజీల బరువు తగ్గాను. అలాగే మా అమ్మ-నాన్న మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉండేది. అందరం చాలా బాగా కలిసి ఉండేవాళ్లం.
మహేష్ బాబు అంటే అమ్మకు చాలా ఇష్టం. ఇక అమ్మ ఇంట్లో పెట్టిన వస్తువులు ఎక్కడివి అక్కడే ఉంచాను. తన రూం కు వెళ్తాను. అన్ని మెమోరీస్ గుర్తొస్తుంటాయి. చిన్నప్పుడు ఎన్ని కోతి వేశాలు వేసిన నన్ను మాత్రం కొట్టకుండా ప్రేమగా చూసుకునేది. నేను ఒక కోతిని అనేది. కానీ కళ్లతోని మా అమ్మ భలే భయపెడ్తుంది.’’ అంటూ నరేష్ చెప్పుకొచ్చారు. అలాగే సూపర్ స్టార్ కు ఇష్టమైన ఫుడ్ గురించి కూడా వెల్లడించారు. అమ్మ ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం చాలా సంతోషంగా ఉండేదన్నారు. లంచ్ చేస్తుంటే పంక్తి భోజనంలా ఉండేదన్నారు. అమ్మ లంచ్‌లో చాలా వెరైటీలు ఉండేవి. మహేష్ బాబు ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ లాగించేసేవాడు. మహేష్ బాబుకు అమ్మ చేసిన ఫుడ్స్ లో బిర్యానీ, గోంగూర మటన్ అంటే ఎంతో ఇష్టమని, కృష్ణ కూడా అమ్మ చేతి వంటను చాలా ఇష్టంగా తింటారని అన్నారు.