- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘విశ్వం’లో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.. ఆసక్తిని పెంచుతున్న కావ్యథాపర్ కామెంట్స్
దిశ, సినిమా: గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 11న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా.. కావ్య థాపర్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘‘విశ్వం’లో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. దాదాపు 16 మంది కమేడియన్స్ ఇందులో ఉన్నారు. ఈ మూవీలో అన్నీ వైవిధ్యంగా ఉంటాయి. అయితే ఇందులో నా క్యారెక్టరే భిన్నంగా డిజైన్ చేశారు దర్శకుడు శ్రీను వైట్ల. సీన్స్ చెప్పి నా చేత చేయించడం అనేది పెద్ద చాలెంజింగ్ అనిపించింది.
ఆయన అన్ని విషయాల్లో ఫర్ ఫెక్ట్‌గా ఉంటారు. సిట్యువేషన్ పరంగా సన్నివేశాన్ని వివరించే విధానంలో కొత్తదనం చూపించారు. నాది చాలా స్టైలిష్ క్యారెక్టర్. నేను కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా ఇందులో చేశాను. మోడ్రన్‌గా ఉండే నేటి ట్రెండ్‌కు తగిన అమ్మాయిని. అందుకే కాస్ట్యూమ్స్ పరంగా చాలా కేర్ తీసుకోవాల్సి వచ్చింది. నాకున్న ఐడియాతో, కాస్ట్యూమ్స్ డిజైనర్ ఐడియాకి తోడు శ్రీను వైట్ల ఐడియాతో కాస్ట్యూమ్స్ ధరించాను. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమాలో చాలా పాత్రలున్నాయి. అందరినీ మోటివేట్ చేయడమంటే మాటలు కాదు. ప్రతివారి నుంచి ఔట్ పుట్ రాబట్టుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే శ్రీను వల్లే నేను బాగా నటించగలిగాను. ప్రత్యేకత ఏమిటంటే అందరి పాత్రలను దర్శకుడు ఎలా యాక్ట్ చేయాలో చేసి చూపించారు. అలా నాకు కూడా నా పాత్రపరంగా చెబుతూ నా శైలిని మలుచుకునే విధంగా చేశారు’’ అని చెప్పుకొచ్చింది.