- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ కష్టాల కడలి దాటేదెన్నడు.. సోనీ హార్ట్ బ్రేకింగ్ నోట్
దిశ, సినిమా : కొంతకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో పోరాడుతున్న అనయ సోని.. మరోసారి తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ హార్ట్ బ్రేకింగ్ నోట్ పోస్ట్ చేసింది. డయాలసిస్ చేయించుకున్న తర్వాతే కిడ్నీ మార్పిడి చేస్తామని డాక్టర్లు చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించిన నటి.. ఈ ప్రాసెస్ సవ్యంగా జరగాలని ప్రార్థించాల్సిందిగా అభిమానులను కోరింది. 'నా కిడ్నీ పాడైపోయినందున డయాలసిస్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
నా క్రియాటినిన్ 15.76కి వచ్చింది. హిమోగ్లోబిన్ 6.7 ఉంది. ప్రస్తుతం నా హెల్త్ కండిషన్ ఊహించని స్థితిలో ఉంది. పవిత్ర ఆత్మతో ఆస్పత్రిలో చేరుతున్నా. నా కోసం ప్రార్థించండి అబ్బాయిలు. 2015 నుంచి నాకు ఒక కిడ్నీ మాత్రమే ఉంది. నా జీవితం తేలికైన ప్రయాణం కాదు' అంటూ రాసుకొచ్చింది. ఇక ఓ పత్రిక కథనం ప్రకారం వైద్యం చేయించుకోవడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఎంతోమందిని ఆర్థిక సాయం అడిగినట్లు తెలుస్తుండగా.. రెండు కిడ్నీలు పాడైపోయిన సోనికి తన తండ్రి గతంలో ఒక కిడ్నీ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి : 'మీటూ' నిందితుడికి స్టార్ నటి సపోర్ట్.. దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్