- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విజయ్‌తో డ్యాన్స్ అనగానే గుండెల్లో దడ పుట్టింది: మీనాక్షి చౌదరి
దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. రీసెంట్గా తెరకెక్కిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో నటించి.. ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ అమ్మడు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తోన్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్‌ఆల్ టైం’ అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది. తాజాగా మీనాక్షి ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ‘ విజయ్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఆయనకు వీరాభిమానిని. విజయ్ షూటింగ్ సమయంలో ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. చాలా కూల్‌గా ఉంటారు. ఈ హీరోతో కలిసి నటించడం నాకు సరికొత్త ఎక్స్పీరియన్స్. కానీ ఈ విజయ్‌తో కలిసి డాన్స్ ఉంటుందని ఓ రోజు దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పగానే నాకు గుండెల్లో దడ పుట్టింది. ఎందుకంటే ఆయన మంచి డాన్సర్’. అంటూ మీనాక్షి చౌదరి వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.