- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mangaluru Resort : స్విమ్మింగ్ పూల్లో ముగ్గురు యువతుల మృతి.. ఏమైందంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని మంగళూరులోని ఓ రిసార్ట్‌లో (Mangaluru Resort) దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఈత రాక ఓ రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. మైసూరుకు చెందిన (Engineering Students) ముగ్గురు ఇంజనీరింగ్ యువతులు కీర్తన (21), నిశిత (21), పార్వతీ (20) ఆదివారం ఉదయం (Vazco beach resort) వాజ్కో బీచ్ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటు మునిగిపోయారు. మొదటగా ఓ యువతి స్విమ్మింగ్ పూల్ లోతులోకి వెళ్లినట్లు వీడియోలో కన్పిస్తోంది. ఆమెను రక్షించేందుకు మిగిలిన ఇద్దరు లోతుగా ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండడంతో పూల్ డెక్కు చేరడానికి వారు తీవ్రంగా శ్రమించారు. ఎంత ప్రయత్నించినా ఫలించకపోవడంతో చివరికి మృత్యువాతపడ్డారు.
అయితే వారు మునిగిపోయే సమయంలో ఆ స్విమ్మింగ్ ఆవరణలో రిసార్ట్ సిబ్బంది ఎవరూ కూడా లేనట్లుగా సీసీ ఫుటేజ్ వీడియోలో కన్పిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. పూల్ వద్ద లైఫ్‌గార్డులు, ప్రాణాలను రక్షించే పరికరాలు, పూల్ లోతును సూచించే స్పష్టమైన సంకేతాలు లేవని పోలీసులు గుర్తించారు. ఘటన నేపథ్యంలో రిసార్ట్ సీజ్ చేసే అవకాశం కన్పిస్తోంది. రిసార్ట్ ఓనర్, మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఏడుగురు ఉద్యోగులు విధుల్లో ఉన్నారని రిసార్ట్ పేర్కొంది.