అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ స్టార్ జంట!

by Vinod kumar |
అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ స్టార్ జంట!
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు 2009లో వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి మేనకోడలు విరానికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారికి నలుగురు సంతానం. ఈ రోజు వారి పెళ్లి రోజు. ఇక విష్ణు నటుడిగా మాత్రమే కాదు ‘మా అధ్యక్షుడు’గా రాణిస్తున్నాడు. దీంతో పాటు తండ్రి మోహన్‌బాబు స్థాపించిన విద్యా సంస్థలను చూసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. తన భార్య విరానికా రెడ్డి కూడా డిజైనర్‌గా పనిచేస్తోంది. తాజాగా లండన్, దుబాయ్, దోహా వంటి వివిధ దేశాల్లో డిజైనింగ్‌కు సంబంధించిన బొటిక్ బ్రాంచ్‌లను కూడా స్టార్ట్ చేయనుంది. ఇలా సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నా ఈ జంట చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed