Mammootty: ఓటీటీలో మమ్ముట్టి మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌

by Prasanna |
Mammootty: ఓటీటీలో మమ్ముట్టి మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌
X

దిశ, సినిమా : ఈ మధ్య కాలంలో సినీ లవర్స్ ట్రెండ్ మార్చారనే చెప్పుకోవాలి. కథ బాగుంటే చాలు రెండు మూడు సార్లు అయినా సినిమా చూసేందుకు ఇష్ట పడుతున్నారు. కథ నచ్చకపోతే మొహమాటం లేకుండా సినిమా మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. కల్కి సినిమా పెద్ద హిట్ అవ్వడంతో మూవీ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. చిన్న సినిమా కూడా లాభాలను పొందగలుగుతుంది.

మలయాళ స్టార్ హీరో ముమ్ముట్టి హీరోగా తెరకెక్కిన మూవీ ‘టర్బో’. ఈ మూవీ పూర్తి యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా మే 23న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. రూ. 70 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లవర్స్ ను అలరించేందుకు రెడీ అవుతుంది.

తాజాగా ఈ మూవీకి సంబందించిన ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 9 న ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీ లివ్‌ లో తెలుగు, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ, త‌మిళం భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. వైశాఖ్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీలో తెలుగు కమెడియన్ సునీల్, క‌న్న‌డ యాక్టర్ రాజ్‌బీ శెట్టి విలన్స్ గా నటించారు. ఈ మూవీకి క్రిస్టో జేవియర్ సంగీతాన్ని అందించారు.

Advertisement

Next Story

Most Viewed