- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పర్‌ఫెక్షన్ వల్ల జీవితంలో కొన్ని కోల్పోవాల్సి వస్తది.. హింట్ ఇస్తూ సంచలన కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాఠి?
దిశ, సినిమా: టాలీవుడ్ లొట్ట చెంపల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి సుపరిచితమే. ఈ హీరోయిన్ ‘అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, దూసుకెళ్తా, ఉన్నది ఒక్కటే జిందగీ, మిస్టర్, మనం, అర్జున గాంఢీవధారి’ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసులో ఓ ముద్ర వేసుకుంది. లావణ్యను యూత్ ఫేవరేట్ హీరోయిన్‌గా చెప్పుకుంటారు. హద్దులు చెరిపేయకుండా చేసే ఈ బ్యూటీ ఫొటో షూట్లకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు.
ఇక మిస్టర్ సినిమాతో పరిచమైన లావణ్య -మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. వీరి లవ్ పై సోషల్ మీడియాలో పలు రూమర్స్ వచ్చినా ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించలేదు. సడన్‌గా గత ఏడాది జూన్ లో నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్ కు ఒక్కసారిగా షాకిచ్చారు. నవంబరులో వరుణ్ -లావణ్య ప్రేమ చిగురించిన ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అయితే లావణ్య పెళ్లయ్యాక మొదటిసారిగా.. ‘‘మిస్ పర్‌ఫెక్ట్’’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘‘ఓటీటీ, సినిమాలు అనే భేదాలు నాకు లేవు. కంటెంట్ బాగుంటే ఏ సినిమాలైనా చేస్తాను. మిస్ ఫర్ ఫెక్ట్ సిరీస్ తో పాటు మరో రెండు మూవీస్ చేస్తున్నాను. నిజజీవితంలో మీరు ఎంత వరకు పర్‌ఫెక్ట్ అని మీడియా వారు ప్రశ్నించగా.. పర్‌ఫెక్షన్ కూడా ఓ సమస్యే. దీనివల్ల చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. వరుణ్ చాలా పర్‌ఫెక్షన్. అతనికి చాలా ఓపిక ఉంటుంది. అలాగే మెగా కోడలి ట్యాగ్‌ను రెస్పాన్సిబిలీటిగా బావిస్తున్నాను. ఆ పిలుపు నాకు చాలా స్పెషల్. కండిషన్స్ విషయానికొస్తే.. అలాంటి, ఇలాంటి పాత్రలు చేయొద్దని నాకు ఎలాంటి కండిషన్స్ లేవు. ఎలాంటి సినిమాలు, క్యారెక్టర్స్ చేయకూడదు.. చేయాలి అనే విషయంలో నా కంటూ క్లారిటీ ఉంది. హద్దులు దాటకుండా మూవీస్ చేస్తాను.’’ అంటూ మెగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి తన కెరీర్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ సినిమాల మోజులో పడి.. సమంత బాటలో పోవు కదా? కొంపదీసి హింట్ ఇస్తున్నావా ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.