వితౌట్ మేకప్‌తో కట్టిపడేస్తున్న కృతి శెట్టి.. నేచురల్ లుక్ వైరల్..!

by Anjali |   ( Updated:2024-04-01 02:21:47.0  )
వితౌట్ మేకప్‌తో కట్టిపడేస్తున్న కృతి శెట్టి.. నేచురల్ లుక్ వైరల్..!
X

దిశ, సినిమా: ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కుర్ర హీరోయిన్ కృతి శెట్టి. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీకి.. తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. తన అందం, నటన, టాలెంట్ తో ప్రేక్షకులందర్ని కట్టిపడేసింది కానీ.. చివరగా ఈ బేబీ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం కృతి శెట్టికి తెలుగులో పెద్దగా ఆఫర్లు కూడా రాకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. శర్వానంద్ సరసన ‘శర్వా 35’ రంగనాథ్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, వా వాతియారే(vaa vaathiyaare), జెనీ (genie) వంటి సినిమాల్లో నటిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో బేబమ్మ స్థానంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, నేహా శెట్టి వంటి మరో కుర్ర హీరోయిన్లు దూసుకుపోతున్నారు. ఇకపోతే ఈ బ్యూటీ వరుస చిత్రాలతో షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. కాస్త సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ తన అందంతో అలరిస్తోంది. వ్యక్తిగత, వృత్తిపర విషయాలు పంచుకుంటూ.. మరోవైపు బ్యూటిఫుల్ ఫొటో షూట్లు షేర్ చేస్తుంది.

తాజాగా ఈ కుర్ర హీరోయిన్ నేచురల్ లుక్ లో మెరిసింది. వితౌట్ మేకప్ తో క్యూట్ క్లోజప్ షార్ట్స్ కు ఫోజులిచ్చి.. కుర్రాళ్ల నుంచి ముసలివారిని సైతం కట్టిపడేస్తుంది. బేబమ్మ నేచురల్ లుక్ కాస్త నెట్టింట వైరల్ అవ్వగా.. ‘వితౌట్ మేకప్ ఆల్సో సో క్యూట్’ అంటూ కృతి శెట్టి అందాన్ని ఆకాశాకి ఎత్తుతున్నారు. లైక్స్, కామెంట్లతో బేబమ్మ పిక్స్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed