- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lokesh Kanagaraj: స్టార్ హీరోలతో మల్టీస్టారర్.. లోకేష్ రియాక్షన్ ఏంటంటే?
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) వరుస సినిమాలు తెరకెక్కిస్తూ భారీ విజయాలు అందుకుంటున్నారు. ప్రజెంట్ ఆయన ‘కూలి’(Coolie) మూవీ షూట్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇందులో రజినీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తుండగా.. పలువురు స్టార్స్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా నుంచి పలువురి పోస్టర్లు కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘రజినీకాంత్(Rajinikanth) నాకంటే ముందే సెట్స్‌కు చేరుకుంటారు.
ఉదయం 9 గంటలకు షూట్ అంటే.. 7 గంటలకే సెట్స్‌కు వచ్చి రెడాగా ఉంటారు. ఈ విషయంలో రజినీ ఎప్పుడూ ముందుంటారు. కమల్ హసన్(Kamal Haasan), విజయ్‌లు కూడా ఆయన టైమింగ్ గురించి ఎన్నోసార్లు నాకు చెప్పారు. కమల్, విజయ్(Vijay) కూడా వారి కోస్టార్‌లను ఎంతో గౌరవించి మాట్లాడుతారు. వారి వల్ల ఎప్పుడూ షూట్ లేట్ కాదు. సమయానికి సెట్స్‌కు వస్తారు.. ఆలస్యమైనా ఫర్వాలేదని నేను చెప్పినప్పటికీ ముందే వచ్చేస్తారు.
అన్ని రోజులు ఒకేలా ఉండవని.. ఒక్కోసారి ట్రాఫిక్ వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని అందుకే ముందు వస్తామని అంటారు. నిజానికి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్(Multi Starrer) చిత్రాలు తెరకెక్కించడం అనుకున్న దానికంటే సులువు అని నేనంటా. ఎందుకంటే వారు క్రమశిక్షణతో ఉంటారు. సమయపాలన పాటిస్తారు. అలాగే తోటి కోస్టార్‌లను గౌరవిస్తుంటారు. స్క్రిప్ట్ విషయంలో కొత్తదనాన్ని కోరుకోవడంతో పాటు మెరుగులు దిద్దడానికి సిద్ధంగా ఉంటారు’’ అని చెప్పుకొచ్చారు.
Read More..