- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు ప్రారంభం కావటంతో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల (Tirumala) శ్రీవారి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు 29 కంపార్టుమెంట్లలో భక్తులు (Devotees) వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీరామ నవమి, ఆదివారం, సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక శనివారం స్వామివారిని 78,496 మంది భక్తులు దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.6 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇక ఇవాళ స్థానికులకు దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు