ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఫీజు చెల్లింపునకు లాస్ట్ డేట్ ఇదే!

by Jakkula Mamatha |   ( Updated:2025-04-12 06:54:44.0  )
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఫీజు చెల్లింపునకు లాస్ట్ డేట్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను(Inter Results-2025) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఇవాళ(శనివారం) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 70%, సెకండియర్ విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదైంది. అయితే ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల(Intermediate Supplementary Examinations)తేదీలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈ నెల(ఏప్రిల్) 15 నుంచి 22 వరకు ఫీజు చెల్లించాలి. ఈ క్రమంలో వచ్చే నెల(మే) 12 నుంచి 20 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి.



Next Story

Most Viewed