- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao : ఆ పిల్లల కోసం బస్సు నడిపించండి : మాజీ మంత్రి టీ.హరీశ్ రావు
దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ(Rtc) బస్సులు సరిపడా లేకపోవడం వల్ల, ఉన్న బస్సులు ఆపకపోవడం వల్ల విద్యార్థులు(students) బడి(School)కి వెళ్ళడం ఆలస్యమవుతుందని మాజీ మంత్రి టి.హరీశ్ రావు( T. Harish Rao) ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల విద్యార్థులు బస్సు కోసం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోతో నిరసన తెలుపుతున్న ఫోటోను హరీశ్ రావు పోస్టు చేశారు. బస్సులు సమయానికి లేక ఆ పాఠశాల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న ఆ విద్యార్థుల సమస్యను తక్షణం ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆ విద్యార్థుల కోసం సకాలంలో బస్సు నడపాలని కోరారు. హరీశ్ రావు గురుకుల విద్యార్థుల సమస్యలపైన, ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సమస్యలపైన వరుస ట్వీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థినిల అస్వస్థతపై ప్రభుత్వాన్ని నిలదీశారు.