క్లింకార లేటెస్ట్ ఫొటోలు వైరల్.. సైడ్ లుక్‌లో అచ్చం రామ్ చరణ్ చిన్నప్పటి పోలికలే.. మురిసిపోతున్న ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2024-05-14 14:05:38.0  )
క్లింకార లేటెస్ట్ ఫొటోలు వైరల్.. సైడ్ లుక్‌లో అచ్చం రామ్ చరణ్ చిన్నప్పటి పోలికలే.. మురిసిపోతున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరి పెళ్లయ్యాక పదేళ్లకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి మెగా ఇంట్లో సంబరాలు తీసుకొచ్చారు. మెగా ప్రిన్సెస్ రాకతో మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. కానీ ఈ బుజ్జాయి ఫేస్ ఇంతవరకు రివీల్ చేయకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎప్పుడెప్పుడు క్లింకార ముఖం చూద్దామా అని ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీగా ఉన్నారు. ఇటీవల రామ్ చరణ్-ఉపాసన కుమార్తె క్లింకారతో వైజాగ్ బీజ్ లో సందడి చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే నిన్న మదర్స్ డే సందర్భంగా ఉపాసన సోషల్ మీడియాలో క్లింకారతో దిగిన ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ ఫొటోలో కూడా మెగా ప్రిన్సెస్ ఫొటోను పూర్తిగా చూపించలేదు. సైడ్ లుక్ లో మాత్రమే క్లింకార కనిపిస్తుంది. కాగా మెగా అభిమానులకు ఈ బుజ్జాయిని సైడ్ లుక్ లో చూశాక చిన్నప్పుడు చరణ్ కూడా సేమ్ ఇలాగే ఉన్నాడంటూ ఓ ఓల్డ్ పిక్‌ క్లింకార ఫొటోలకు కింగ్ అండ్ ప్రిన్సెస్ అని క్యాప్షన్ జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Advertisement

Next Story