Keerthy Suresh: బెస్ట్ డ్యాన్సర్ అతడేనంటూ కీర్తి కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

by Hamsa |
Keerthy Suresh: బెస్ట్ డ్యాన్సర్ అతడేనంటూ కీర్తి కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు నేను శైలజా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నానితో నేను లోకల్ సినిమా చేసి మంచి క్రేజ్ తెచ్చుకుని పలు ఆఫర్లు అందుకుంది. ముఖ్యంగా కీర్తి మహానటి మూవీతో నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సావిత్ర బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

అలాగే నాని సరసన నటించిన దసరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీకి ఏకంగా 5 ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. ఎంతోమంది ప్రశంసలు కూడా అందుకుంది. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రజెంట్ ఈ అమ్మడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహానటి దళపతి విజయ్ డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించింది. అలాగే ఆయనే బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పుకొచ్చింది. ఇక ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టింది. అలాగే అల్లు అర్జున్ లాగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను అని తెలిపింది. ప్రజెంట్ కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ హర్ట్ అయి ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. చిరంజీవి బెస్ట్ డాన్సర్ అని కాకుండా విజయ్ అనడమేంటని ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed