- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను ప్రేమించిన వాడికి పొగరు ఎక్కువే.. అయినా భరిస్తున్నా: ‘బలగం’ ఫేమ్ Kavya Kalyan
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ‘బలగం’ ఫేమ్ కావ్యా కల్యాణ్ తన రాబోయే మూవీ ‘ఉస్తాద్’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. శ్రీ సింహ కోడూరి హీరోగా ఫణిదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమా కంటెంట్ అందరికీ నచ్చుతుంది. సూర్య ప్రేయసి మేఘన పాత్రలో నటించాను. ముక్కుమీద కోపం కలిగివున్న వ్యక్తిని మెచ్యూర్డ్‌గా ఆలోచించేలా చేసే క్యారెక్టర్ నాది. ఉస్తాద్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పటి వరకూ మంచి స్పందన వచ్చింది’ అని చెప్పింది. అలాగే ‘తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావటం లేదని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదు. ఎందుకంటే, సావిత్రి, శ్రీదేవి తెలుగు హీరోయిన్స్ అయినా సక్సెస్ అయ్యారు. ఇండియా వైడ్ వాళ్ల కంటే సక్సెస్‌ను ఎవరూ చూడలేదు. నా విషయానికి వస్తే నేను తెలుగు అమ్మాయి కావటంవల్ల నాకు మేలే జరిగింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో తెలుగు మాట్లాడే అమ్మాయికే దర్శకులు మొగ్గుచూపారు. భాష వస్తే చాలు అవకాశం వస్తుందనుకోకూడదు. ఎందుకంటే నటీనటులు ఒక భాషకే పరిమితం కాకూడదు’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
Also Read: Tarakతో పనిచేయడమంటే నాకు చాలా ఇష్టం.. ఎగ్జయిట్‌గా ఉంటుంది
- Tags
- Kavya Kalyan Ram