Katrina Kaif : కత్రినా కైఫ్ చేతిపై ఏంటది..? అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్న అభిమానులు

by Javid Pasha |   ( Updated:2024-10-05 13:46:28.0  )
Katrina Kaif : కత్రినా కైఫ్ చేతిపై ఏంటది..? అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్న అభిమానులు
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా అప్పుడప్పుడూ ఆయా వేదికలపై తళుక్కుమంటూ అలరిస్తుంది. ఫ్యాషన్ వేడుకల్లో, విమానాశ్రయాల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అందమైన నవ్వులతో, హావభావాలతో అభిమానుల చూపు తనవైపు తిప్పుకోవడంలో కత్రిన రూటే సపరేటు అంటుంటారు సినీ లవర్స్. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇక్కడ నెటిజన్లను ఆకట్టుకున్న విషయం మరొకటి ఉంది. ఏంటంటే.. ఆమె చేతిపై ఏదో నల్లటి ఆకారం అందరి దృష్టినీ ఆకర్షించింది.

వైరల్ వీడియో సమాచారం ప్రకారం.. కత్రినా కైఫ్ అందమైన చీరకట్టులో, ఫెస్టివల్ లుక్‌లో తళుక్కుమంటూ ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. కాగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆమె ఇలా రెడీ అయిందని అందరూ భావిస్తున్నారు. ఇంత వరకూ ఓకే. కానీ ఈ సందర్భంగా ఆమె చేతిపై ఉన్న నల్లటి ప్యాచ్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదేమైనా కొత్త ఫ్యాషనా? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ నిజానికి అది డయాబెటిస్ ప్యాచ్ అని నిపుణులు పేర్కొంటున్నారు. బ్లడ్ షుగర్ మానిటర్ ప్యాచ్ అని కూడా పిలుస్తారు.

మధుమేహం ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే బయటకు వెళ్లినప్పుడు అవి ఏ స్థాయిలో ఉన్నాయి? తగ్గాయా.. పెరిగాయా? ఈజీగా తెలుసుకొని అలర్ట్ అవ్వడానికి డయాబెటిస్ ప్యాచ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒక స్టిక్కర్ మాదిరి వీటిని చేతికి అతికించుకుంటే చాలు. షుగర్ లెవల్స్‌కు సంబంధించిన సమాచారం కనెక్టెడ్ మొబైల్ ఫోన్‌కు మెసేజ్ రూపంలోనూ అందుతుంది. వీటిని చాలా మంది వాడుతున్నప్పటికీ, సెలబ్రిటీలు బయటకు కనిపించకుండా జాగ్రత్త పడతారు. కాకపోతే కత్రినా కైఫ్ మాత్రం అలా చేయలేదు. డయాబెటిస్ ప్యాచ్ ధరించి ఎయిర్ పోర్ట్‌కు వచ్చింది. దీంతో ఆమె చేతికున్నది ఏంటనే విషయం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.

Video Credits to Pallav-paliwal Insta Id

Advertisement

Next Story