- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jr. NTR: జూ.ఎన్టీఆర్ కు గాయం నిజమే.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్
దిశ, డైనమిక్ బ్యూరో: యంగ్ టైగర్.. జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదం బారిన పడ్డారంటూ జరుగుతున్న ప్రచారం పై ఆయన టీమ్ స్పందించింది. జూ.ఎన్టీఆర్ కు గాయమైన మాట నిజమేనని స్పష్టం చేసింది. అయితే అది ప్రచారం జరుగుతున్నట్లుగా రోడ్డు ప్రమాదంలోనో, సినిమా షూటింగ్ లోనో కాదని క్లారిటీ ఇచ్చింది. ఇటీవల జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టుకు గాయం అయిందని దీంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారని తెలిపింది. గత రాత్రి దేవర సినిమా షూటింగ్ లోనూ పాల్గొన్నారని.. ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారని కాస్త విరామం అనంతరం మళ్లీ షూటింగ్ లో పాల్గొంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు జూ.ఎన్టీఆర్ ఎడమ చేతికి కట్టు కట్టుకున్న ఓ ఫోటోనూ ఆయన టీమ్ విడుదల చేసింది. కాగా ఎన్టీఆర్ గాయాల విషయంలో ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
Read More..
Big Breaking: జూ.ఎన్టీఆర్‌కు ప్రమాదం!