- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Krishna vamshi: ఆ సాంగ్‌లో సౌందర్య చీర రంగులు మార్చింది నేను కాదు.. స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్
దిశ, సినిమా: దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్‌డమ్ అందుకుంది. అప్పట్లోనే తన డ్రెస్సింగ్ స్టైయిల్‌కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తెలుగు ప్రేక్షకుల్లో ఒక కూతురు, చెల్లి, అక్క స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సౌందర్య అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. ఇక సౌందర్య కెరీర్‌లో ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు చేసినా.. ఎప్పటికీ మర్చిపోయి సినిమా మాత్రం ‘అంత:పురం’. సాయికుమార్ హీరోగా సౌందర్య హీరోయిన్‌గా కృష్ణవంశి ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో అసలేం గుర్తుకురాదు పాటనైతే ఎవర్ గ్రీన్ హిట్. ఇప్పటికీ ఈ పాట చాలా మంది ఫేవరేట్ కూడా. కాగా ఈ సాంగ్‌లో సౌందర్య చీర రంగులు మారుతు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. చెప్పాలంటే ఇదే ఈ సాంగ్‌కుహైలైట్ కూడా. ఇది ఫస్ట్ టైం చూసిన ప్రేక్షకులు అయితే కృష్ణవంశీ భలే చేశాడే అని మాట్లాడుకుంటున్నారు. కాగా తాజాగా దీనిపై ఎక్స్‌లో కృష్ణవంశీ స్పందించాడు.
ఒక నెటిజన్ అంతఃపురం ‘అసలేం గుర్తుకురాదు’ పాటలో సౌందర్య గారి చీర రంగులు మారడం భలే అనిపించింది, కొత్తగా ఉంది. అప్పట్లో ఆ ఐడియా ఎలా వచ్చింది సార్ అని అడిగాడు. దీనికి కృష్ణవంశీ రిప్లై ఇస్తూ.. అది ఫిల్మ్‌లో లేదు సార్. జెమిని టీవీలో ఎడిటర్ ఎడిట్ చేశాడు. రిలీజ్ తర్వాత బాగుంది అని మేము అడ్డు చెప్పలేదు అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ షాక్ అవుతున్న ఎమోజీలు పెట్టారు. ఇన్నేళ్లకు సంచలన ట్విస్ట్ రివీలయిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.